త్వరలో GROUP 2&3 నోటిఫికేషన్

 2,910 ఉద్యోగాలకు ఉత్తర్వులు జారి 

వివిధ శాఖల్లో మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.తాజాగా అనుమతి లభించిన వాడిలో గ్రూప్ 2 ,గ్రూప్3 పోస్టులు కూడా ఉన్నాయి.గ్రూప్ 2 కింద 663, గ్రూప్ 3 కింద 1373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.వివిధ శాఖల్లోని మరో 874 పోస్టులను కూడా భర్తీ చేయనుంది.ఈ పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నెంబర్ 145,గ్రూప్ 3 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నెంబర్ 146 ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రూప్ 2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, గ్రేడ్ 3 మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దారులు, ఏసీటీవోలు ,సబ్ రిజిస్టర్ ,ఎక్సైజ్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3 కేటగిరిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి,ఏప్రిల్ తో పాటు ఆగస్టు నెలలో కూడా పలు దాఫాలుగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మంగళవారం రాత్రి టిట్టర్లో పోస్ట్ చేశారు.

TSPSC GROUPS 2 AND 3

TSPSC GROUPS 2 AND 3




Comments