దేశవ్యాప్తంగా 4జి సేవలతో మొబైల్ ఇంటర్నెట్ రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన మెగా విప్లవాన్ని దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు.దేశ టెలికం, డిజిటల్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.4జీ కంటే సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ అయిన 5జీ సేవల్లోను రిలయన్స్ జియో అదే మాదిరి వ్యూహాన్ని అమలు చేయనుంది. రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 2023 చివరికి 5జీ సేవలు అందించేందుకు సదా సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల AGM లో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా తదితర కొన్ని ఎంపిక చేసిన ప్రధాన పట్టణాల్లో ఈ దీపావళికి 5జి సేవలు మొదలవుతాయి.
రిలయన్స్ జియో 5జి నెట్వర్క్ పై రెండు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో ఆ తర్వాత 2023 డిసెంబర్ దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. 'సిసలైన పాన్- ఇండియా 5జి నెట్వర్క్ నిర్మించేందుకు మేము రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం వచ్చే రెండు నెలల్లో అంటే దీపావళి నాటికి ఢిల్లీ,ముంబై,చెన్నై,కోల్కత్తా కీలకమైన మెట్రో నగరాలలో జియో ప్రారంభిస్తాం'అని ముఖేష్ అంబానీ వివరించారు అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్ది స్మార్ట్ సెన్సార్స్‌ను ఆవిష్కరిస్తామని అవి ఇంటర్నెట్ ఆబ్జెక్ట్ థింగ్స్ నాలుగో పారిశ్రామిక విప్లవానికి భూతం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు ప్రత్యేకంగా భారత్ కోసం 5 సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్విజం క్వాల్‌కామ్ తో జట్టు కట్టినట్టు అంబాని చెప్పారు అలాగే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ తో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు.ఇటీవల ముగిసిన వేలంలో జియో 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రాన్ ను కొనుగోలు చేసింది.మరోవైపు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
5G MOBILE UNDER Rs-15000 IN INDIA


Comments
Post a Comment