ఆరుగురి యువకుల కోరికలు
రాజుకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు మంత్రి రాజు గారిని కొనియాడుతూ,మీరేం కోరుకున్న ఇస్తానని మాట ఇస్తాడు.
మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు
రెండో యువకుడు తను తన కుటుంబ సభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు
మూడవ అతను తనుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు
నాలుగవ యువకుడు తను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురితో వివాహం జరిపించాలని కోరుకుంటాడు
ఐదవ యువకుడు తన తండ్రి చేసిన అప్పులను తీర్చాలని కోరుతాడు
ఐదుగురు యువకులకు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు
ఇక ఆరవ యువకుడి వంక చూసి 'నీకేం కావాలి' అని అడుగుతాడు రాజు.యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత భయపడతాడు. అయితే రాజు 'ఎటువంటి భయం లేకుండా ఏది కావాలన్నా అడుగు' ఇస్తానంటాడు మాట తప్పని అంటాడు. అప్పుడు ఆ యువకుడు తనకు నగలు నట్రా ఏమి అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి వారం లేక పది రోజులు ఉండాలి నాకు అంతకన్నా ఏమీ వద్దు అంటాడు.
రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు.అయితే ఆ తర్వాతే ఆ యువకుడి కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమైంది.అవును ఆ నిజమేంటంటే రాజు అతని ఇంటికి వచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్లే రహదారులన్నీ బాగుపడతాయి అలాగే అతను ఉన్న సమయంలో అతని కోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికి ఓ అర్హత లభిస్తుంది ఇలా ఉండగా మొదటి అయిదుగురు కోరుకున్న వారిని కలిపి ఇతను ఒక్క మాటతో తీర్చబోతున్నాడు తన కోరికను అతను ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడి తెలివితేటలను గ్రహించి అతనికి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు.
ఈ కథ వల్ల తెలుసుకోవాల్సిందేమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం .సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేది ఏమిటంటే ఈ ఐదుగురి యువకుల తనకు అది కావాలి ఇది కావాలి అడుగుతారు.దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే అనుకున్నది జరుగుతాయి అని గ్రహించాలి.
.png)
Comments
Post a Comment