విషాన్ని చిమ్మే కీటకం/గ్రౌండ్ బీటిల్/Ground Beetle
మనం ప్రపంచంలోని చాలా రకాల కీటకాలను చూసి ఉంటాం.ఒక్కో కీటకానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కీటకం చాలా భిన్నమైనది దాని పేరు 'గ్రౌండ్ బీటీల్', దీనిని 'బాంబార్దియర్ బీటిల్' అని కూడా అంటారు. అలా పిలవడానికి గల కారణం దానికి ఉన్న ప్రత్యేక ' రక్షణ వ్యవస్థ'.
ఏంటి ఆ రక్షణ వ్యవస్థ అంటే ఈ కీటకం కడుపులో 'ఆక్సిజన్',' హైడ్రోక్వీనోన్' విడుదల చేసే రెండు' పెగిడియల్' గ్రంధులు ఉంటాయి ఈ రెండు రసాయనాలు కలిస్తే అతి ప్రమాదకరమైన ' బెంజోక్వినోన్' గా ఏర్పడుతుంది. ఈ కీటకం పై ఇతర జీవులు దాడికి ప్రయత్నించినప్పుడు త్వరగా ఎగరలేదు కానీ తనను తాను రక్షించుకునేందుకు బెంజోక్వినోన్ విడుదల చేస్తుంది.
రసాయనం వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసినప్పుడు బాంబులాగా పాప్ అనే శబ్దం వస్తుంది, ఈ రసాయనం ఇతర జీవులకు చిరాకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది ఈ కారణం చేత ఈ కీటకం పై ఇతర జీవులు దాడి చేయలేవు.
ఈ కీటకం ఒకేసారి 20 నుండి 25 సార్లు ఈ రసాయనాన్ని విడుదల చేస్తుంది. అంటార్కిటికాలో మినహా మిగతా అన్ని ఖండాలలో దీని మనుగడ కొనసాగిస్తుంది.ఈ కీటకానికి సంబంధించిన సుమారు 500 జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా దీన్ని నివాసం చెట్ల బెరడు కింద దుంగల కింద రాళ్ల సందుల్లో చెరువుల దగ్గర నదుల అంచున ఉన్న ఇసుకల్లో ఉంటుంది.

Comments
Post a Comment