రాజు,మంత్రి ఒక మెరిసే రాయి కథ
అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దర్శనానికి వచ్చిన ఒక సామంత రాజు తన చేతిలోని సంచిని రాజుకు అందిస్తూ 'ఇది ఒక వజ్రం మా రాజ్యంలో నిపుణులు ఎవరు దీని విలువను కనిపెట్టలేకపోయారు దీని విలువైనతో తెలిపే నిపుణులు మీ రాజ్యంలోనైనా ఉన్నారేమో పరీక్షించండి'అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ వజ్రం ఎలా ఉంటుందో చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరమెట్లు గోలిపే కాంతితో ఒక వస్తువు కనిపించింది అంతే దాని విలువను బేరీజు చేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరికీ ఆదేశించాడు. అందరూ ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. తమ పరిజ్ఞానాన్ని అంతటిని ఉపయోగించారు, పుస్తకాలు వెతికారు, గ్రంథాలు తిరిగేసారు కానీ ఫలితం లేకుండా పోయింది దీంతో వాళ్లంతా రాజు దగ్గరకు వెళ్లి 'దీన్ని లెక్క కట్టడం మాకు ఎవ్వరికి సాధ్యం కాలేదు కాకపోతే లక్ష వారాలకు తక్కువ ఉండదని మా అభిప్రాయం' అని చెప్పారు. ఆ రాజు మర్నాడు ఆ వజ్రంని తీసుకువచ్చి సబికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువను కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు.
అప్పుడే సభలోకి వస్తున్న మహామంత్రి మాత్రం రాజుగారి ప్రకటన విని 'ఓస్ అదెంతా పని' అని అనుకుంటూ వజ్రాన్ని తీసుకొని తన చాతి దగ్గర పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉన్నాడు. 'మహా మంత్రి ఏం చేస్తున్నావు' అని సున్నితంగానే మందలించాడు రాజు. ప్రభువు ఇది ఎక్కువ కాంతిని వెదజల్లేలా అనేక ముఖాలు చిక్కిన ఒక రాయి మాత్రమే అని తేల్చేశాడు మహామంత్రి. 'నువ్వు చెప్పింది నిజమని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపో' అని మహామంత్రిని కోపగించుకున్నాడురాజు
సరే రాజా అంటూ రాజుతో సహ అందర్నీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లాడు రామలింగడు తలుపులు మూసేసి ఒక బల్ల మీద ఆ రాయి వుంచి' ప్రభువు మీరు ఇందాకటి నుంచి వజ్రమని చెబుతున్న రాయి ఈ గదిలోనే ఉంది ఇక్కడున్నా వారిలో ఎవరినైనా దాని కనిపెట్టండి'అని చెప్పాడు.రాజు గారితో సహా ఎవ్వరు వజ్రని కనిపెట్టలేకపోయారు. అప్పుడు మహామంత్రి 'రాజా నిజానికి ఈ రాయి మీ ముందు ఉన్న బల్ల మీదే ఉంది వజ్రం అయితే చీకటిలోనూ మెరుస్తుంది కదా ఇందాక నేను చేసిన పని అదే ఈ రాయిని నా చొక్కా జేబులో పెట్టుకుని వెలుగు వస్తుందేమోనని గమనించాను'అని అసలు విషయం చెప్పాడు మహామంత్రి .అతని తెలివితో మరోసారి రాజ్యా సత్కారాన్ని అందుకున్నాడు.

Comments
Post a Comment