తెనాలి రామకృష్ణ కథ


ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు మంత్రులతో సభ నిర్వహిస్తుండగా ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను గుర్రాల వర్తికుడిగా పరిచయం చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న అందమైన అరేబియన్ గుర్రం బొమ్మను చూపించాడా వర్తకుడు. అందంగా,బలంగా ఉన్న ఆ గుర్రం రాయలవారికి నచ్చి కోనడానికి అంగీకరించాడు. దర్బారు బయటకు వచ్చి అక్కడున్న నిజమైన గుర్రాన్ని చూసి నాకు ఇలాంటివి 10 గుర్రాలు కావాలి అన్నాడు రాయలు.అయితే ముందు ఐదు వేల బంగారు నాణేలు నాకు ఇవ్వండి రెండు రోజుల్లో గుర్రాలను తెచ్చి మిగతా మొత్తం తీసుకుంటాను అన్నాడు వర్తకుడు,ఎలాగైనా ఆ గుర్రాల్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి కావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని ఆదేశించాడు. రెండు వారాలు గడిచాక ఒకరోజు సాయంత్రం బయటకు వెళ్ళిన రాయల్ కి దూరంగా గుర్రం సకిలించడం వినిపించింది. అప్పుడు వర్తకుడికి డబ్బు ఇచ్చిన సంగతి గుర్తొచ్చింది దాని గురించి ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా.....

   తెనాలి రామలింగడు ఎదురుగా ఏదో రాస్తూ కనిపించాడు.

'ఏం రాస్తున్నావు రామలింగ'అని అడిగాడు రాయలు.

'అమాయకుల పేర్లు రాస్తున్న మహారాజా' అన్నాడు.

'అమాయకుల పేర్ల ఏది చూపించు......'అంటూ అతడి చేతిలో ఉన్న జాబితా తీసుకొని పేర్లు చూడగా మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది 'నేను అమాయకుడిన'అని అడిగారు శ్రీకృష్ణదేవరాయలు. 'తెలియని వాడికి 5000 బంగారు నాణాలు ఇచ్చిన మీరు అమాయకులు కాకపోతే ఏమవుతారు' బదులిచ్చాడు రామలింగడు.

'ఏమో వాడు నేడు రేపు వస్తాడేమో'కోపంగా అన్నాడు రాయలు.

'అలా వస్తే అప్పుడు మీ పేరు చెరిపేసి వాడి పేరు మొదట రాస్తాను' అని జవాబు ఇచ్చాడు రామలింగడు అతని మాటల్లోని వాస్తవం అర్థమైంది.

'నిజమే నేను కాస్త తెలివి తక్కువగానే ప్రవర్తించాను ఇకపై బాగా ఆలోచించకుండా ముఖ్యంగా మీలాంటి వారి సలహా తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయము తీసుకోను' అని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు.

Comments